సాధ్వి రితంబర వివాదాస్పద వ్యాఖ్యలు

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  హిందూ జాతీయ వాది సాధ్వి రితంబర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత దేశం త్వరలోనే హిందూ రాజ్యాంగ అవతరించబోతుందని, అందుకోసం దేశంలో ప్రతి హిందూ జంట నలుగురు పిల్లల్ని కని ఇద్దరినీ దేశానికి అంకితం చేయాలని అన్నారు. ఇప్పటివరకు “మేమిద్దరం - మాకు ఇద్దరు” అనే విధానాన్ని పాటిస్తున్న హిందూ దంపతులు ఇకపై నలుగురిని కని, పెంచీ ఆ పిల్లల్లో ఇద్దరినీ దేశానికి ఇవ్వాలని సాధ్వి రితంబర పిలుపునిచ్చారు. ఇద్దరు పిల్లల్లో ఒకరిని ఆర్ఎస్ఎస్ కు, మరొకరిని విశ్వహిందూ పరిషత్ కు అప్పగించాలని సాధ్వి రితంబర సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత దేశం హిందూ రాజ్యాంగ అవతరించనుందని, అందులో దేశ ప్రజల భాగస్వామ్యం ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. సాధ్వి రితంబర ప్రస్తుతం “దుర్గ వాహిని” అనే హిందూ ధార్మిక సంస్థ వ్యవస్థాపక చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ కి  చెందిన మహిళా విభాగమే ఈ దుర్గ వాహిని. అయితే..తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు సాధ్వి సుముఖత వ్యక్తం చేయలేదు. జహింగీర్ పురి హింస ఘటనపై సాధ్వి రితంబర స్పందిస్తూ..దేశంలో అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారే ఇటువంటి చర్యలకు పాల్పడుతారని, రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని విభజించాలని చూస్తున్నవారు మట్టికరవక తప్పదని ఆమె అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)