స్కూటీ వేలల్లో - నెంబర్ లక్షల్లో ..!

Telugu Lo Computer
0


ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ ఎలా ఉంటుందో మనం చూస్తూనే వుంటాం.  ఫ్యాన్సీ నెంబర్లు కోసం ఆర్టీవో ఆఫీసులో వేలం పాటల్లో అత్యధిక రేటుకు పెట్టి కొనుగోలు చేస్తుంటారు. ఒక వ్యక్తి 71 వేలకు హోండా యాక్టివా కొనుగోలు చేసి దానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 15.44 లక్షలు ఖర్చు చేసిన ఘటన చండీఘడ్ లో వెలుగు చూసింది. చండీఘడ్ కు చెందిన బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. రూ.71 వేలు పెట్టి హోండా యాక్టివా కొన్నాడు. దానికి ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆర్టీవో ఆఫీసులో అతను రూ.15.44 లక్షలు ఖర్చు చేశాడు. ఈ విషయమై మోహన్ మాట్లాడుతూ హోండా యాక్టివాను ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను వినియోగిస‍్తాను. త్వరలో కారు కొంటా. ఆ కారుకి కూడా సేమ్‌ ఫ్యాన్సీ నెంబర్‌ను ఉపయోగిస్తానని చెబుతున్నాడు. బ్రిజ్ మోహనే సీహెచ్‌01- సీజే-0001 కోసం అత్యధికంగా రూ. 15.44 లక్షలు చెల్లించినట్లు ఆర్టీఓ అధికారులు తెలిపారు. సీహెచ్ 01 సీజే 0002 ధర రూ, 5.4 లక్షలు పలకగా…. సీహెచ్ 01 సీజే 0007నెంబర్ ధర 4.4 లక్షలు పలికింది. సీహెచ్ 01 సీజే 003 నెంబర్ ను రూ. 4.2 లక్షలకు వాహనదారులు సొంతం చేసుకున్నారు. ఈ సమయంలో 378 మంది నెంబర్లను వినియోగ దారులు కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)