మెట్రోస్టేషన్ పై నుంచి దూకిన బాలిక ఆత్మహత్యాయత్నం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 14 April 2022

మెట్రోస్టేషన్ పై నుంచి దూకిన బాలిక ఆత్మహత్యాయత్నం


గురువారం ఉదయం ఓ బాలిక దిల్లీలోని అక్షరధామ్‌ మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సత్వర చర్యతో మహిళను రక్షించారు. బ్లూ లైన్‌లోని అక్షర్‌ధామ్ మెట్రో స్టేషన్‌లో గోడపై నుంచి దిగమని సీఐఎస్‌ఎఫ్ అధికారి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉదయం 07:28 గంటలకు జరిగింది. బాలికను రక్షించే ప్రయత్నంలో సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆమెతో ముచ్చటిస్తుండగా మరోవైపు సిబ్బంది కింద దుప్పటి పరిచారు. స్టేషన్ పై నుంచి దూకిన బాలిక దుప్పటిపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమె పాదాలకు గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment