వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా స్వాసా బడ్జ్ గ్రామానికి చెందిన మనోహర్ అహిర్వార్ కుమార్తె రీనాకు జలౌన్ జిల్లా చమరి గ్రామానికి చెందిన రవికాంత్ అహిర్వార్‌తో వివాహం నిశ్చయమైంది.ఏప్రిల్ 17న వివాహానికి బంధువులు, స్నేహితులు అందరూ హాజరయ్యారు. అయితే వరుడు, వధువుకు దండ వేయబోతుండగా ఒక్కసారిగా వధువు రెచ్చిపోయి వరుడు చెంప చెళ్లుమనిపించింది. ఏం జరుగుతుందో అక్కడున్న వారికి అర్థం కాలేదు. ఈ లోగా. వధువు కళ్యాణ మండపం నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు జోక్యం చేసుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ను షేర్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)