సామలు - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


సామలను అన్నీ వయస్సుల వారు తినవచ్చు. బాగా జీర్ణం అవుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వీటిలో ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్, నెమ్మదిగా జీర్ణం అవ్వటం, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సామలు రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేసి గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తాయి. సామలు హైపోగ్లైసీమిక్ మరియు హైపోలిపిడెమిక్ ప్రభావాలను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే పాలీఫెనాల్స్, ఫినాలిక్ సమ్మేళనాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు డయాబెటీస్ నియంత్రణలో,గుండె ఆరోగ్యంగా ఉండటానికి,జీర్ణ సమస్యలు,కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. సామలలో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ B3 కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫాస్ఫరస్ సమృద్దిగా ఉండుట వలన కొవ్వు జీవక్రియ, శరీర కణజాల మరమ్మత్తు మరియు శక్తి ఉత్పత్తికి సహాయపడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)