తాటి ముంజలు - ప్రయోజనాలు

Telugu Lo Computer
0


వేసవిలో వేడి పెరుగుతున్న కొద్దీ ఆ ఉష్ణోగ్రతను మన శరీరం తట్టుకోలేదు. దానికి తట్టుకునే శక్తి ఇవ్వాలంటే తాటి ముంజల్లాటి చలువ చేసే ఆహారాన్ని తినాల్సిందే. వీటిని  ఐస్ ఆపిల్ అని, పాల్మీరా పామ్ అని పిలుస్తారు. జెల్లీలా, చేత్తో పట్టుకుంటే జారిపోయేంత సున్నితంగా ఉంటాయివి.  ఇవి తింటే క్యాలరీలు తక్కువగా, శక్తి ఎక్కువగా అందుతుంది. వేడి వల్ల వచ్ఛే సమస్యలన్నీ వీటితో తీరిపోతాయి. ఎండవేడిమికి డీ హైడ్రేట్ అయిపోతారు చాలా మంది. అలా డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలన్న, గురయ్యాక త్వరగా కోలుకోవాలన్నా తాటిముంజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, ఐరన్, కాల్షియం తాటి ముంజల్లో లభిస్తాయి. వీటి గుజ్జు రుచి లేత కొబ్బరిలా ఉంటుంది. వేసవిలో గర్భిణులు కచ్చితంగా వీటిని తినాలి. ఇవి జీర్ణ వ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు రావు. వీటిలో అధికమొత్తంలో నీరే ఉంటుంది కనుక శరీర బరువును కూడా తగ్గిస్తాయి. అమ్మవారు వంటి వేసవి వ్యాధుల బారిన పడిన వారు కూడా వీటిని తింటే మంచిది. ఇవి కాలేయ సంబంధ వ్యాధులును కూడా తగ్గిస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం కాలేయంలో ఉన్న టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. అలాంటప్పుడు శరీరానికి చాలా అలసటగా అనిపిస్తుంది. ఆ నీరసాన్ని, అలసటను వెంటనే తాటిముంజలు దూరం చేస్తాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)