ఆస్తి మొత్తాన్నిరాహుల్ గాంధీ పేరిట రాసిచ్చిన వృద్ధురాలు !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన 78ఏళ్ల పుష్ప యాంజియల్ అనే వృద్ధురాలు తన ఆస్తి మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ పేరున రాసిచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. 50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారంతో సహా తన ఆస్తులన్నింటినీ రాహుల్ గాంధీకి చెందేలా వీలునామా రాశారు. ఇందుకు సంబంధించిన ఆస్తిపత్రాలను కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ నివాసంలో పుష్పా యాంజిల్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా  రాహుల్ గాంధీ ఆమె మాట్లాడుతూ, ఆయన ఆలోచనలు దేశానికి అవసరమని పుష్ప యాంజిల్ వివరించారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు తాను చాలా ప్రభావితమయ్యానని, ఆయన అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఈ దేశానికి ఎంతో అవసరమని, అందుకే తన మరణానంతరం ఆస్తిని ఆయనకు అందేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వృద్ధురాలు వెల్లడించింది. ఇదే విషయాన్ని డెహ్రాడూన్ కోర్టుకూ చెప్పానని తెలిపారు. ఈ దేశ సమైక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని పుష్ప యాంజిల్ పేర్కొన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు దేశసేవకు తమను తాము అంకితం చేసుకున్నారని, దీంతో తాను ఎంతగానో ప్రభావితమయ్యానని యాంజియల్ అన్నారు. అయితే వృద్ధురాలి నిర్ణయంతో తొలుత ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ నేతలు ఆమె చెప్పిన విషయాలను విని అభినందించారు. ఇదిలాఉంటే ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 19 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 47 సీట్లు గెలుచుకొని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో 78ఏళ్ల వృద్ధురాలు రాహుల్ పై తన అభిమానాన్ని చాటుకోవటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)