కరోనా ఇంకా అంతరించిపోలేదు

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఓ కార్యక్రమంలో వర్చువల్‌ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటూ...  కరోనాపై చేస్తోన్న పోరులో ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వం వహించవద్దని, ఎన్నో రూపాలను మార్చుకుంటున్న మహమ్మారి మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో ఎప్పటికీ తెలియదని, వైరస్‌ ఉద్ధృతి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ అది ఇంకా అంతరించిపోలేదని, మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందనిపేర్కొన్నారు. ఇటువంటి కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటివరకు 185కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామన్న ఆయన ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అయితే, అత్యంత వేగంగా సంక్రమించే సామర్థ్యమున్నట్లు భావిస్తోన్న 'ఎక్స్‌ఈ' వేరియంట్‌ గుజరాత్‌లో వెలుగు చూసిన నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి అప్రమత్తం చేశారు. 'కరోనా మహమ్మారి అతిపెద్ద సంక్షోభం, అది ఇప్పుడే ముగిసిపోయిందని చెప్పడం లేదు. ప్రస్తుతం విరామం తీసుకొని ఉండవచ్చు, కానీ, మళ్లీ ఎప్పుడు విరుచుకుపడుతుందో మనకు తెలియదు. అది ఎన్నో రూపాలు కలిగిన వ్యాధి. అటువంటి దాన్ని అడ్డుకునేందుకు ఇప్పటివరకు 185 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించి యావత్‌ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాం. ప్రజల సహకారంతోనే అది సాధ్యమైంది' అని మోదీ ఈ విధంగా మాట్లాడారు. ఇదే సమయంలో మాతృభూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించిన మోదీ.. ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)