అరటి పండు - సూచనలు !

Telugu Lo Computer
0


అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు దండిగా ఉంటాయి. 100 గ్రాముల అరటి పండులో 258 మిల్లీగ్రాముల పొటాషియం, 2.6 గ్రాముల పీచు, 14 శాతం విటమిన్ సి, 20 శాతం విటమిన్ B6, 6 శాతం మెగ్నీషియంలోపాటు మాంగనీస్, రాగి, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి. పొద్దున్నే ఖాళీ కడుపున వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. తద్వారా డీహైడ్రేట్‌ అవుతారు.  అలాగే శక్తినీ కోల్పోతారు. ఈ క్రమంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందటానికి అరటి పండు మంచి మార్గం. దీనిని మార్నింగ్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా కసరత్తులు చేయవచ్చు. అదేవిధంగా సాయంత్రం పూట స్నాక్స్‌ రూపంలో అరటి పండ్లను తీసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అరటి పండును తీసుకోకపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇతర పండ్లతో లేదా పాలతో కలిపి అరటి పండును తీసుకోకూడదు. నైట్ సాధ్యమైనంత వరకు అరటి పండును తినకపోవడమే మేలు. అలా తీసుకోవడం వల్ల ఒక్కోసారి జలుబు లాంటి సమస్యల బారిన పడవచ్చు. రాత్రి అరటి పండు తినడం వల్ల శరీరంలో మ్యూకస్ తయారవుతుంది. ఇది శ్వాస కోశ సమస్యలకు కారణం అవుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం తర్వాత కూడా అరటి పండును తినకూడదు. చాలామంది పాలతో కలిపి అరటి పండును తీసుకుంటే, మరికొంతమంది పాలు తాగాక దీనిని తింటుంటారు. అయితే ఈ రెండు పద్ధతులూ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు ఉన్నా, పరగడుపున ఈ పండును తినడం శ్రేయస్కరం కాదు. ఆమ్లతత్త్వం కలిగిన అరటిపళ్లు పరగడుపున తింటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)