కొత్త జిల్లాల పర్యవసానం - కొన్ని ఆసక్తికర అంశాలు!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల ఫలితంగా  నెల్లూరు జిల్లాలోని సముద్ర ప్రాంతం కలిగిన సూళ్లూరు పేట, గూడూరు నియోజక వర్గాలు కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో కలిసిన  ఫలితంగా రాయలసీమ ప్రాంతానికి కూడా ఇప్పుడు సముద్రం వచ్చేసినట్టే. రాయలసీమ ప్రాంతంలోని భౌగోళిక స్వరూపంలో వచ్చిన మార్పు ఇది. ఇప్పటి వరకూ తీర ప్రాంతమంటే..శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకూ ఉన్న ప్రాంతం. 9 జిల్లాలుండేవి. రాయలసీమలోని 4 జిల్లాలకు అసలు సముద్రమన్నది లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి సముద్రం వచ్చి చేరింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్ని 8 జిల్లాలుగా విభజించారు. మరో రెండు ఆసక్తికర పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. గ్రేటర్ రాయలసీమ అంటూ నెల్లూరు ప్రాంతాన్ని రాయలసీమలో కలపాలనే వాదన ఉంది. జిల్లాల విభజనతో నెల్లూరు జిల్లాలోని 2 నియోజకవర్గాలు రాయలసీమలోని తిరుపతిలో కలవడంతో సాంకేతికంగా ఆ వాదన నెరవేరినట్టే. ఇక మరో ముఖ్య పరిణామం విశాఖపట్నం జిల్లా అత్యంత చిన్న జిల్లాగా అవతరించింది. అంతేకాకుండా రాష్ట్రంలో అసలు రూరల్ ప్రాంతం లేని జిల్లాగా విశాఖపట్నం నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)