దినసరి కూలీని కోటీశ్వరుడిని చేసిన లాటరీ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 2 April 2022

దినసరి కూలీని కోటీశ్వరుడిని చేసిన లాటరీ


పశ్చిమ బెంగాల్​లోని దక్షిణ 24 పరగణాలకు చెందిన దినసరి కూలీ అల్ఫాజుద్దీన్ పైక్‌. లాటరీ టికెట్​లో జాక్​పాట్ కొట్టి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అల్ఫాజుద్దీన్ తన భార్య, కొడుకుతో కలిసి పాథర్‌ప్రతిమ బ్లాక్‌లో అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆర్థికంగా బాగా వెనుకబడినప్పటికీ సంపాదించిన కొద్ది మెుత్తాన్నీ లాటరీ టిక్కెట్లు కొనడానికి ఖర్చు చేసేవాడు అల్ఫాజుద్దీన్. స్థానికులు హేళన చేసినా పట్టించుకునేవాడు కాదు. ఇలాగే కొన్న ఓ లాటరీలో జాక్​పాట్ కొట్టాడు అల్ఫాజుద్దీన్. కోటి రూపాయల లాటరీలో విజేతగా నిలిచాడు. లాటరీ స్టాల్ యజమాని టికెట్​ను పైక్​ చేతికి ఇచ్చాడు. అయితే, పైక్ ఎవరికీ చెప్పకుండా లాటరీ టిక్కెట్​ను జేబులో పెట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడి పైక్​ను వెతకటం ప్రారంభించారు. ఎంతకీ అతని ఆచూకీ తెలియకపోవడం వల్ల ధోలాహత్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పైక్ కోసం వెతకడం ప్రారంభించిన పోలీసులకు తెల్లవారుజామున ఓ అరటి తోటలో అతడు కనిపించాడు. తన నుంచి ఎవరైనా లాటరీ టికెట్​ను లాక్కుంటారేమోనని భయంతో తోటలో దాక్కున్నట్లు తెలిపాడు. అతని మాటలు విన్న పోలీసులు పైక్​కు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లారు. లాటరీలో వచ్చిన కోటి రూపాయలతో సొంత ఇళ్లు నిర్మించుకుంటానని పైక్ అంటున్నాడు. అలాగే తనకున్న అప్పులన్నీ తీర్చేస్తానని చెబుతున్నాడు.

No comments:

Post a Comment