సంకల్పం + చాతుర్యం + సహనం = విజయం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 2 April 2022

సంకల్పం + చాతుర్యం + సహనం = విజయం


ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సూపర్ వైరల్ అయింది. ఓ బుడతడు చేపలు పట్టే విధానం చూసి అందులో ఒక విజయ రహస్యం ఉందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. వీడియోలో ఓ బాలుడు చేపలు పట్టేందుకు చెరువు గట్టుకువెళ్ళాడు. అక్కడ ఒడ్డునే ఒక గిలక చట్రాన్ని బిగించి..గేలం మొనకు మూడు పిండి ముద్దలు అద్దాడు ఆ బాలుడు. అనంతరం ఆ గేలాన్నీ నీళ్ళల్లోకి విసిరేసి అక్కడే ఓపిగ్గా కూర్చున్నాడు బాలుడు. అనంతరం గేలానికి రెండు భారీ చేపలు చిక్కడంతో బాలుడు సంతోషంతో వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ 'రోజురోజుకి పెరుగుతున్న సంక్లిష్ట ప్రపంచంలో..ఈ దృశ్యాన్ని చూడటానికి వింతగా ప్రశాంతంగా ఉంది. ఇందులో ఉన్న నీతి ఏంటంటే 'సంకల్పం + చాతుర్యం + సహనం = విజయం' అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశాడు. జీవితంలో విజయం దక్కాలంటే సంకల్పం, క్రియేటివిటీ, ఓర్పు అనేవి అలవర్చుకోవాలని అప్పుడు విజయం దానంతట అదే వస్తుందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్కరోజులోనే సుమారు 11 లక్షలకు పైగా వ్యూస్,80 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

No comments:

Post a Comment