దేశంలో 913 కొత్త కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


చైనా, బ్రిటన్‌ వంటి పలు దేశాల్లో కరోనా ఉధృతి పెరగగా, దేశం లో మాత్రం వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. తాజాగా కొత్త కేసులు వెయ్యిలోపు నమోదుకావడం భారీ ఊరట కలిగిస్తోంది. ఇక మరణాలు 20 దిగువకు తగ్గిపోయాయి. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం నిన్న 3 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 913 మందికి కరోనా సోకినట్లు తేలింది. 715 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు క్షీణించాయి. ముందురోజు కంటే 16 శాతం మేర కేసులు తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువనే ఉంది. ఇప్పటివరకూ 4.30 కోట్లకు పైగా కరోనా కేసులొచ్చాయి. 24 గంటల వ్యవధిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితంరోజు సంఖ్య 81గా ఉంది. ఇప్పటివరకూ 5.21 లక్షల మంది చనిపోయారు. 1,316 మంది కోలుకోగా.. క్రియాశీల కేసులు 12 వేలకు దిగొచ్చాయి. క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పరీక్షల సంఖ్య తగ్గింది. అలాగే టీకా పంపిణీ కూడా నామమాత్రంగానే సాగింది. నిన్న కేవలం రెండు లక్షల మందికి పైగా టీకా తీసుకోగా.. మొత్తంగా 184 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)