ఎరువులపై 50 శాతం సబ్సిడీ పెంపు

Telugu Lo Computer
0


ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఎరువుల సబ్సిడీతోపాటు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. రాబోయే ఖరీఫ్ సీజన్‌ కోసం ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే 50 శాతం సబ్సిడీని పెంచారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులు, డీఏపీకి కూడా సబ్సిడీని వర్తింప జేస్తారు. ఈ సబ్సిడీ మొత్తం విలువ రూ.60,939.26 కోట్లుగా ఉంటుందని అంచనా. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల వేగం పెంచాలని నిర్ణయించింది. 2జీ సర్వీసులను 4జీకి అప్‌గ్రేడ్ చేయబోతుంది. దీనికోసం రూ.2,426.39 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 2,343 బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లను 4జీకి అప్‌గ్రేడ్ చేస్తారు. జమ్ము-కాశ్మీర్‌లో చేపట్టనున్న 504 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు కోసం 4,526.12 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు 54 నెలల్లో పూర్తవుతుంది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,700 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కోసం 820 కోట్లను కూడా కేటాయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)