ఆర్టీఐ దరఖాస్తుపై స్పందించని అధికారికి వినూత్న శిక్ష!

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లోని భూపేంద్ర కుమార్ పాండే 2016లో ఘాజీపూర్ జిల్లాలోని నూన్రా గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని ఆర్టీఐ చట్టం ప్రకారం దరఖాస్తు చేశారు. అయితే నూన్రా గ్రామాభివృద్ధి అధికారి, ప్రజా సమాచార అధికారి (పీఐఓ) చంద్రిక ప్రసాద్ ఈ చట్టం నిర్దేశించిన గడువు 30 రోజుల్లోగా దీనికి సమాధానం ఇవ్వలేదు. దీంతో పాండే రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సమాచార కమిషనర్ అజయ్ కుమార్ విచారణ జరిపి, ఈ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని చంద్రిక ప్రసాద్‌ను ఆదేశించారు. దీనికోసం గరిష్ఠంగా రూ.25,000 వరకు ఖర్చు చేయాలని తెలిపారు. సాధారణంగా పీఐఓలకు రూ.25,000 వరకు జరిమానా విధిస్తూ ఉంటారు. కానీ సమాచార కమిషనర్ వినూత్నంగా ఆలోచించి ఈ తీర్పు చెప్పారు. ఆర్టీఐ చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని పీఐఓలు 30 రోజుల్లోగా అందజేయాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)