పంజాబ్‌ లో 300 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితం

Telugu Lo Computer
0



పంజాబ్‌లో భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఏర్పడి నేటికి నెల రోజులు అయిన సందర్భంగా ఆప్ ప్రభుతం జూలై 1 నుండి ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ ధృవీకరించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ చేసిన ప్రధాన వాగ్దానాలలో ఒకటి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. పంజాబ్‌లో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా ఉచిత విద్యుత్‌ ఇస్తామని ఆప్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో మరో ప్రధాన హామీ అయిన డోర్ స్టెప్ రేషన్ డెలివరీ స్కీమ్‌ను అమల్లోకి తెస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు మార్చి 19న, సీఎం భగవంత్ మాన్, తన మొదటి క్యాబినెట్ సమావేశంలో 25వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)