ప్రాణాలివ్వడానికి ముస్లింలు ముందుంటారు

Telugu Lo Computer
1


మధ్యప్రదేశ్‌లోని బుల్డోజర్ ఘటనపై సీఎం శివరాజ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా మండిపడ్డారు. సాక్షాత్తు ప్రభుత్వమే చట్టాన్ని తుంగలో తొక్కితే.. ఇక దేశ భక్తికి ఇక ఏం గౌరవం ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. సొంతంగా ప్రభుత్వమే ఇళ్లపై రాళ్ల దాడులు చేయించిందని ఈయన ఆరోపించారు. అయినా.. ముస్లిం వర్గీయులు దేశం కోసం ప్రాణాలివ్వడానికి సదా సిద్ధంగానే వుంటారని స్పష్టం చేశారు. కానీ.. ఎలాంటి కారణాలు లేకుండా… ఇళ్లపై, పిల్లలపై దాడులు చేస్తే వాళ్ల పరిస్థితి ఏంటని నిలదీశారు. చట్టాన్ని పక్కనబెట్టి, రూల్స్‌ను అతిక్రమించి, ఇళ్లపై దాడులు చేస్తే.. ఇక దేశభక్తికి అర్థమేంటని సల్మాన్ ఖుర్షీద్ విరుచుకుపడ్డారు. శ్రీరామ నవమి సమయంలో చెలరేగిన ఘర్షణ తర్వాత అక్కడి ప్రభుత్వం 52 ఇళ్లపై దాడులు చేసింది. దుకాణాలను కూడా కూలగొట్టింది. అలాగే 42 మందిపై కేసులు కూడా నమోదు చేసింది. అందులో 35 మంది ముస్లింలు. ఏడు మంది హిందువులు కూడా వున్నారు. ఇక.. ఈ విషయానికి సంబంధించి 144 మందిని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

Post a Comment

1Comments

  1. ఇంతకు ముస్లింలు రాళ్ళు వేశారా? పూలు వేశారా ? సల్మాన్ ఖుర్షిద్ గారు

    ReplyDelete
Post a Comment