కొత్త కార్మిక చట్టాలు జూలై 1 నుంచి అమలు

Telugu Lo Computer
0


జూలై 1 నుంచి ఆఫీస్ వర్కింగ్ అవర్స్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్,  కంట్రిబ్యూషన్స్‌తో పాటు ఇన్-హ్యాండ్ శాలరీలో భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తేదీ నుంచి ఆఫీస్ వర్కింగ్ అవర్స్, పీఎఫ్ కంట్రిబ్యూషన్స్ పెరిగే అవకాశం ఉండగా ఇన్-హ్యాండ్ శాలరీ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త లేబర్ కోడ్స్ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. ఈ కోడ్స్ ప్రకారం... ఎంప్లాయిస్ శాలరీ, పీఎఫ్ కంట్రిబ్యూషన్, వర్కింగ్ అవర్స్‌లో గణనీయమైన మార్పులు రానున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. నివేదికల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా లేబర్ కోడ్స్ అమలు చేసేందుకు యత్నిస్తోంది. అయితే, అన్ని రాష్ట్రాలు ఇంకా నిబంధనలను సిద్ధం చేయనందున ఇవి అమలులోకి రావడానికి కనీసం మూడు నెలల సమయం పట్టొచ్చు. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లోగా వేతనాలు, సోషల్ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఆక్యుపేషన్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్లపై నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమలు చేసే అవకాశం ఉంది. కొత్త కార్మిక చట్టాల  ప్రకారం, పనిదినాలలో మార్పు అనేది అమలులోకి రావొచ్చు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, కంపెనీలు ఉద్యోగులను ఐదు రోజులకు బదులుగా నాలుగు రోజులు పని చేయించుకోవచ్చు. అప్పుడు వారంలో మూడు రోజులు సెలవులు ఉంటాయి. అయితే, వన్ ఫుల్ వర్కింగ్ డే తగ్గినందున ఉద్యోగులు 8 గంటలకు బదులుగా రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. కొత్త కోడ్స్ వల్ల టేక్ హోమ్ శాలరీ లేదా ఇన్-హ్యాండ్ శాలరీ, అలానే ప్రావిడెంట్ ఫండ్‌లో ఉద్యోగులు, యజమాని కంట్రిబ్యూషన్ల నిష్పత్తి మారనుంది. కొత్త కోడ్స్ నిబంధనల ప్రకారం, ఉద్యోగి బేసిక్ శాలరీ గ్రాస్ శాలరీలో 50 శాతం ఉండాలి. ఉద్యోగి, యజమాని పీఎఫ్ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయని దీని అర్థం. దీనివల్ల కొంతమంది ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారికి టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం, పదవీ విరమణ తర్వాత పొందే డబ్బుతో పాటు గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది. "చాలా రాష్ట్రాలు కొత్త ముసాయిదా నిబంధనలను ఖరారు చేసినందున ఈ నాలుగు లేబర్ కోడ్‌లు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2021లో ఈ కోడ్‌లకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. అయితే లేబర్ అనేది ఉమ్మడి సబ్జెక్ట్ కాబట్టి, వీటిని కూడా రాష్ట్రాలు ఒకే సారి అమలు చేయాలని కేంద్రం కోరుతోంది" అని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)