మైనర్ బాలికపై డాక్టర్ వెకిలి చేష్టలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 27 April 2022

మైనర్ బాలికపై డాక్టర్ వెకిలి చేష్టలు !


విశాఖపట్నంలోని ఉక్కు ఉద్యోగుల జనరల్ ఆసుపత్రిలో ఓ వైద్యుడు తన వంకరబుద్ధిని బయటపెట్టాడు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన ఓ మైనర్ బాలికపై చీఫ్ డాక్టర్ కపాడియా అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో సదరు బాలిక ఆస్పత్రి బయటకు వచ్చి 100 నంబర్‌కు కాల్ చేసింది. తనపై వెకిలి చేష్టలకు పాల్పడ్డ డాక్టర్‌పై తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు విశాఖ కేజీహెచ్ గైనిక్ వార్డులో సిబ్బంది నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. పాప పుడితే రూ. రెండు వేలు, బాబు పుడితే రూ. మూడు వేలు సిబ్బంది డిమాండ్ చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున పెషేంట్లను ఉంచుతున్నారని.. అదే సింగిల్ బెడ్ కావాలంటే రూ. వెయ్యి నుంచి రూ. మూడు వేలు వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిస్తేనే బిడ్డను ఇస్తామంటున్నారని తల్లులు వాపోతున్నారు.

No comments:

Post a Comment