జూలై 17న నీట్ పరీక్ష

Telugu Lo Computer
0


నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష తేదీల షెడ్యూల్ ప్రకటించింది. MBBS, BDS వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతి ఏడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఎన్టీఏ. JEE పరీక్షల్ని కూడా NTA నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన JEE పరీక్షల్ని NTA మళ్లీ వాయిదా కొత్త షెడ్యూల్ ప్రకటించింది. దీంతో పాటు ఇప్పుడు NEET UG 2022 పరీక్షల షెడ్యూల్ కూడా వెల్లడించింది. దీనికి సంబంధించి పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది. MBBS, BDS వైద్యకోర్సుల్లో ప్రవేశాల కోసం జూలై 17న నీట్ పరీక్ష నిర్వహించనుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నీట్ పరీక్ష నిర్వహించనుంది. ఈ రోజు నుంచి మే 6 వరకు నీట్ పరీక్షలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనుంది. దేశంలోని 543 నగరాలు, పట్టణాలతో పాటు వివిధ దేశాల్లోని పలు ప్రాంతాల్లో NEET EXAM నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ NEET పరీక్షను ఇంగ్లీషు, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో నిర్వహించనుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, జువాలజీ విభాగాల్లో 50 మార్కుల చొప్పున 2 వందల మార్కులకు పరీక్ష నిర్వహించనుంది. ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం సమయం కేటాయించింది. దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షలమంది ఈ NEET పరీక్షకు హాజరవుతున్నారు. 2022 నుంచి నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో గరిష్ట వయోపరిమితిని కూడా ఎత్తేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)