వీర్య దానం కొంపముంచింది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 April 2022

వీర్య దానం కొంపముంచింది !


జీవిత భాగస్వామి దగ్గర ఏదైనా విషయం దాస్తే అది ఎంతవరకైనా వెళ్తుంది. ఒక్కోసారి ఊహించని నష్టం కూడా సంభవిస్తుంది. అదే ఓ వ్యక్తి జీవితంలో జరిగింది. అతను భయపడి తన భార్య దగ్గర ఓ విషయాన్ని దాచిపెట్టాడు. అది తెలుసుకున్న భార్య తనను మోసం చేశాడని భావించి విడిపోవడానికి సిద్ధపడింది. తన జీవితం ఎలా సంక్షోభంలో పడిందో సదరు వ్యక్తి రెడ్డిట్‌ పోస్ట్‌ ద్వారా పంచుకున్నాడు. అతను స్టోరీ ఇప్పుడు వైరల్ అయింది. ఓ వ్యక్తి కాలేజీలో తను చదువుకుంటున్న సమయంలో అదనపు డబ్బుల కోసం వీర్యం దానం చేశాడు. అయితే కాలేజీ చదువు పూర్తైన తర్వాత ఆ పని మానేశాడు. జీతంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో మళ్లీ వీర్యం దానం చేయడం ప్రారంభించాడు. కానీ ఆ విషయాన్ని తన భార్యకు ఎప్పుడు చెప్పలేదు. అయితే వారి పాత ఫ్రెండ్స్‌ అందరూ కలసినప్పుడు పిల్లల గురించి మాట్లాడుకునే సందర్భంలో వీర్య దానం గురించి ఆమెకు తెలిసిపోయింది. ఈ విషయం తెలిసి ఆమె చాలా షాక్ అయింది. దానిని ఆమె జీర్ణించుకో లేకపోయింది. తను మోసపోయానని భావించింది. దాంతో ఆ వ్యక్తితో గొడవ పడి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. ప్రస్తుతం ఈ జంట తమ పిల్లలను వారి తల్లిదండ్రులకు దగ్గరకు పంపించేయాలనుకుంటున్నారు. ఈ పరిణామంతో వీర్యం దానం చేసిన వ్యక్తి చాలా బాధపడుతున్నాడు. "నేను కాలేజీలో ఉన్నప్పుడు స్పెర్మ్ డోనర్‌గా మారాను. నేను డబ్బు కోసం అలా చేశాను. అలాగే పిల్లలను కోరుకునే వారికి సహాయం చేస్తున్నానని అనుకున్నాను. కానీ దీనివల్ల ఇప్పుడు కష్టపడుతున్నానను" అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అలాగే తన భార్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించనలేదని కూడా పేర్కొన్నాడు. అయితే ఈ స్టోరీ చదవిన యూజర్లు ఆ వ్యక్తినే తప్పుబడుతున్నారు. ఈ రహస్యాన్ని తన భార్యకు చెప్పేసి ఉండాల్సిందని అంటున్నారు. తన దగ్గర విషయం దాచడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అలాగే మీరు దానం చేసిన వీర్యంతో పుట్టిన వారంతా మీ పిల్లలు కాకపోవచ్చు. కానీ చాలామంది పిల్లలు తమ పుట్టుకకు గురించి తెలుసుకోవాలని భావిస్తారని కామెంట్ పెట్టారు. ఏది ఏమైనా భార్య దగ్గర ఈ విషయాన్ని దాచి ఉండాల్సింది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

No comments:

Post a Comment