పెరుగు - ప్రయోజనాలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 29 March 2022

పెరుగు - ప్రయోజనాలు !


పెరుగు ఆరోగ్యానికి మంచిదని తెలుసు. కానీ కొంత మందికి పెరుగు అంటే ఇష్టం ఉండదు. ఆ వాసన కూడా పడదు. కొందరికి పెరుగన్నం తినకుండా భోజనం చేస్తే వారికి అసలు తిన్నట్లే ఉండదు. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మంచి బ్యాక్టీరియాలను వృద్ధి చేసే ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. కానీ పెరుగు అందరికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగు తినడం ద్వారా శరీరానికి కావల్సినంత కాల్షియం లభిస్తుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. కానీ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు పెరుగు అస్సలు తినకూడదు. ఒకవేళ తినట్లయితే. సమస్య మరింతగా పెరుగుతుందట!. జీర్ణవ్యవస్థకు పెరుగు చాలా మంచిదని మన పెద్దోళ్లు కూడా చెబుతుంతారు. అయితే అసిడిటీ సమస్య ఉన్నట్లయితే పెరుగు అస్సలు తినకూడదు.  ఒకవేళ తింటే అజీర్ణం కావొచ్చు. రాత్రి సమయాల్లో కూడా పెరుగును తినకపోవడమే మంచిది. ఆస్తమా లేదా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే పెరుగుకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఎవరైనా లాక్టోస్ ఇన్‌టాలరెన్స్ తో బాధపడుతున్నట్లయితే వారు కూడా పెరుగును తినవద్దు. అతిసారం లేదా కడుపు నొప్పి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఈ జాబితాలో ఉన్న రోగులు కేవలం పెరుగుకే కాదు. పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండటం మంచిది. అలా అని పాల ఉత్పత్తులను పూర్తిగా మీ జీవితంలోంచి తీసేయమని కాదు..వీలైనంత వరకు తగ్గించండి. పెరుగును మాత్రం తీసుకోకపోవటం మంచిదంటున్నారు వైద్యులు.

No comments:

Post a Comment