పెళ్లయిన ఐదు నెలలకే ఆత్మహత్య ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 29 March 2022

పెళ్లయిన ఐదు నెలలకే ఆత్మహత్య !


కర్ణాటక తుమకూరు జిల్లాలోని అక్కిమరిపాళ్య గ్రామంలో శంకరప్ప 45 ఏళ్లు వచ్చే వరకు వివాహం జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న మేఘన (25) అతడ్ని ప్రేమించింది. అయితే మేఘనకు కూడా అప్పటికే వివాహం అయింది. ఆమె భర్త రెండేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. దీంతో శంకరయ్య అంగీకరించి మేఘనను 2021 అక్టోబర్​లో గుడిలో వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి వార్త అప్పట్లో వైరల్​ అయింది. అయితే పెళ్లైన తర్వాత మేఘన తరచూ తన అత్తగారితో గొడవపడేది. శంకరయ్యకు చెందిన రూ.2.5 కోట్ల భూమిని అమ్మేయాలని ఇటీవల ఇంట్లో ఒత్తిడి తెచ్చింది. ఇందుకు శంకరయ్య అమ్మ అంగీకరించలేదు. తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శంకరయ్య విసిగిపోయాడు. పొలంలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


No comments:

Post a Comment