పాకిస్థాన్‌ లో బాలిక కాల్చివేత

Telugu Lo Computer
0


పాకిస్థాన్‌ లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో అపహరణ ప్రయత్నంలో 18 ఏళ్ల యువతిని దుండగులు కాల్చి చంపారు.  సింధ్ ప్రాంతంలో మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన పలువురు మహిళలను తీవ్రవాదులు అపహరించి, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు.పాకిస్థాన్‌లోని మైనారిటీ వర్గాలు చాలా కాలంగా బలవంతపు వివాహాలు, మత మార్పిడులు చేస్తున్నారు. 2013నుంచి 2019 సంవత్సరాల మధ్యకాలంలో 156 బలవంతపు మతమార్పిడుల సంఘటనలు జరిగాయని పీపుల్స్ కమిషన్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ పేర్కొంది. పాకిస్థాన్ దేశంలో హిందువుల జనాభా శాతం 1.60 శాతం ఉంది. కాగా సింధ్ ప్రాంతంలో అత్యధికంగా హిందూ జనాభా 6.51 శాతం మంది ఉన్నారు. పాకిస్థాన్ దేశంలో 90 లక్షల మంది ఉన్న హిందువుల జనాభా కొందరు తరచూ తీవ్రవాదుల వేధింపులపై ఫిర్యాదులు చేస్తుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)