పాసు పోర్టులతో మూసుకుపోతున్న టాయిలెట్ పైపులు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 March 2022

పాసు పోర్టులతో మూసుకుపోతున్న టాయిలెట్ పైపులు!


టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ మధ్య పదే పదే టాయిలెట్ పైపులు బ్లాక్ అవుతున్నాయంట. టాయిలెట్ పైపులు మూసుకుపోతుండడంతో బాత్రూంలలో మురుగు నీరు బయటకి పోలేక, అక్కడే నిలిచిపోవడంతో ఎయిర్ పోర్టుకి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. టాయిలెట్లను రోజు శుభ్రపరుస్తున్నా.. మళ్ళీ మళ్ళీ మురుగు పైకి వస్తుండడంతో అక్కడి క్లీనింగ్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. విషయం కాస్త ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి వెళ్లడంతో..విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అసలు విషయం తెలిసిన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ అధికారులు అవాక్కయ్యారట. ఎందుకంటే అక్కడి టాయిలెట్ పైపుల్లో ప్రయాణికుల పాసుపోర్టులు ఇరుక్కుని ఉన్నాయట. వాటిలో ఎక్కువగా భారతదేశం జారి చేయబడిన పాసుపోర్టులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులోని టాయిలెట్ పైపుల్లో భారతీయులకు చెందిన పాసుపోర్టులు.. ముక్కలు ముక్కలుగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు అవన్నీ అక్రమ వలసదారుల  పాసు పోర్టులుగా గుర్తించారు. భారత్ నుంచి నిత్యం వందల సంఖ్యలో వలసదారులు అమెరికాకు వెళ్లేందుకు అక్రమ మార్గాలను వెతుకుంటున్నారు. సాధారణంగా అయితే.. దుబాయ్, దోహా ఎయిర్ పోర్టుల మీదుగా అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్తుంటారు భారతీయులు. అయితే అక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇస్తాంబుల్ వరకు ఇండియన్ పాస్ పోర్ట్ తో వెళ్లి, అక్కడి నుంచి మెక్సికో, టర్కీ, యూఎస్ కు చెందిన నకిలి పాసుపోర్టులతో అమెరికా చేరుకుంటారు. ఈ నకిలీ పాసుపోర్టులను తయారు చేసి వలస దారులను దేశాలను దాటించేందుకు అంతర్జాతీయంగా ఒక పెద్ద ముఠానే పనిచేస్తున్నట్లు గతంలోనూ అనేక వార్తలు వచ్చాయి. వలస వెళ్లే వారు ఆ ముఠా సభ్యుల సూచనలను తూచా తప్పక పాటిస్తున్నారు. ముఠా సభ్యుల సూచనల ప్రకారం.. వలస వెళ్లే వారు ముందుగా ఇండియా నుంచి నేరుగా ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో దిగగానే అక్కడి అధికారుల కంట పడకుండా.. ముందుగా బాత్రూంకు వెళ్లి తమ వద్దనున్న నకిలీ ఇండియన్ పాసుపోర్టును ముక్కలుగా కత్తిరించి “టాయిలెట్ ఫ్లష్”లో పడేస్తారు. బయట ఎక్కడన్నా పడేసిన సీసీ కేమెరాలో దొరికిపోయే ఛాన్స్ ఉన్నందున..ఇలా బాత్రూంలోనే పడేస్తున్నారు. అనంతరం తమ వద్దనున్న ఇతర దేశ నకిలీ పాసుపోర్టుతో మెక్సికోకి చేరుకుంటారు. అక్కడి నుంచి అమెరికా సరిహద్దు దాటే వరకు ముఠా సభ్యులు పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తారు. నకిలీ పాసుపోర్టుతో పట్టుబడితే తిరిగి వెనక్కు పంపిస్తారు. లేదంటే జైల్లోనూ పెడతారు. వీటి నుంచి తప్పించుకోవడానికి పాసుపోర్టులను ఇలా టాయిలెట్ లో పడేస్తున్నారు. అక్రమ మార్గంలో అమెరికాకు వలసవెళ్లే వారిలో మెక్సికో, చైనా తరువాత భారతీయులు అధికంగా ఉన్నట్లు ఇటీవల ఒక విచారణలో తేలింది. గతంలో భారతీయులు ఇంతలా వలస వెళ్లేవారు కాదని.. కానీ ఇప్పుడు అక్రమ వాలసదారుల్లో ఎక్కువ భాగం భారతీయులే ఉంటున్నట్లు అమెరికా కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది.

No comments:

Post a Comment