ఒడిశాలో ప్రజల మీదకు దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు

Telugu Lo Computer
0


ఒడిశా ఖుర్దాలో ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ చిక్కుల్లో పడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గత సంవత్సరం బీజేడీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. ఖోర్దా జిల్లాలోని బాన్ పూర్ లో బ్లాక్ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రశాంత్ SUV వాహనంలో అక్కడకు వెళుతుండగా బ్లాక్ ఆఫీసు వద్ద గుమికూడి ఉన్న ప్రజలపైకి ఒక్కసారిగా ఆయన కారు దూసుకపోయింది. దీంతో 15 మంది బీజేపీ, ఒక బీజేడీ కార్యకర్తలతో సహా ఏడుగురు పోలీసులతో పాటు..మరికొంతమందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఓ మహిళను బాన్ పూర్ లోని ఆసుపత్రికి తరలించగా మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు అతని కారుపై దాడికి పాల్పడ్డారు. వాహనం ధ్వంసం కావడంతో జగదేవ్ తలకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అతడిని రక్షించి భువనేశ్వర్ లోని ఆసుపత్రికి తరలించారు. బీజేపీ నేత పృథ్వీ రాజ్ హరిచందన్ ప్రమాదస్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు బాలుగావ్ ఎస్ డి పి ఓ  తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)