జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 18 వరకు చేరుకుంది. మృత్యువాత పడ్డవారిలో కొందరిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కన్పించడంతో వారిని దవాఖానలో చేర్పించారు. గంటల వ్యవధిలో వారిలో కొందరు మృతి చెందడం మిస్టరీగా మారింది. ఈరోజు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ ఒడిశా వాసి ఉపేంద్ర మృతి చెందగా.. గుంటూరు దవాఖానలో చికిత్సపొందుతున్న వరదరాజుల పరిస్థితి విషమంగా ఉంది. కాగా గ్రామంలో మృతుల సంఖ్య పెరిగిపోతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో డాక్టర్లు, అధికారులు గ్రామానికి వెళ్లి ఇంటింటా విచారణ జరుపుతున్నారు. మృతుల్లో ఎక్కువమందికి మద్యం అలవాటు ఉందని, కల్తీ సారా తాగి చనిపోయారని కొందరు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్‌ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పట్టణంలోని పలు కల్తీ సారా తయారి కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నారు. నాటుసారా బట్టీలను ధ్వంసం చేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)