ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాలు నిలదీత

Telugu Lo Computer
0


పెరుగుతున్న పెట్రో, గ్యాసు ధరలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గురువారం లోక్‌సభలో నిలదీశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిణామాలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి  హర్దీప్ సింగ్ పూరీ సమాధానమిచ్చారు. సాధ్యమైనంత త్వరలోనే ప్రజలకు అందుబాటు ధరలకు ఇంధనం దొరికేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌ఎన్‌జి ధర 37 శాతం పైగా పెరిగింది. సైనిక చర్యలు ఇప్పటికీ కొలిక్కిరాని మార్కెట్ పరిస్థితితో ఈ పరిణామం ఏర్పడిందని, దీనితోనే పెట్రోలు, డీజిల్, వంటగ్యాసు ధరలను ఇక్కడ పెంచాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ద్రవరూప సహజ వాయువు ధరలు ఎగబాకాయని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ధర భారీగా పెరిగినా ఇక్కడ బంకులలో ధరలు కేవలం 5శాతం అనివార్యంగా ప్రస్తుతానికి పెంచాల్సి వచ్చిందని తెలిపారు. ఇక వంట గ్యాసుకు సంబంధించి ధరలు పూర్తిగా సౌదీ కాంటాక్టు ప్రైస్‌పై ఆధారపడి ఉంటాయి. రెండేళ్ల కాలంలో ఈ ధర 285 శాతం ఎగబాకింది. దీనికి అనుగుణంగానే ఇక్కడ గత ఆరు నెలల్లో 37శాతం వరకూ పెంచాల్సి వచ్చిందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)