ఉక్రెయిన్ స్వాధీనంలోకి జపరోజియా

Telugu Lo Computer
0


ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభానికి కారణం అవుతున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి చర్చలు జరపాలని ఇరుదేశాలను ప్రపంచం కోరుతోంది. ఈ వారాంతంలో మరోసారి రష్యాతో శాంతి చర్చలు జరపాలనే ఆలోచనలో వుంది ఉక్రెయిన్. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 331 మంది పౌరులు మృతి చెందగా 685 మందికి గాయాలయ్యాయి. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చంటున్నారు. ఖేర్సన్ కు దక్షిణ ప్రాంతాలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఓజోవ్ సముద్ర తీరంలోని మరియు పోల్ ఓడరేవు నగరాన్ని దిగ్బంధం చేశాయి రష్యా సేనలు. విద్యుత్, తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంగా మారింది మరియుపోల్ ఓడరేవు నగరం. 4 లక్షల 50 వేల మంది జనాభా ఉన్న మరియుపోల్ ఓడరేవు నగరాన్ని బాంబు దాడులతో ధ్వంసం చేసింది రష్యా. యూరోప్ లో అత్యంత భారీ అణు విద్యుదుత్పత్తి కేంద్రమైన "జపరోజియా" ను స్వాధీనం చేసుకున్న తర్వాత, అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మరో అతి పెద్ద అణు విద్యుదుత్పత్తి కేంద్రానికి సమీపంలోకి చేరాయి. అయితే జపరోజియా" అణు విద్యుదుత్పత్తి కేంద్రం పై రష్యా దాడిని "యుధ్ద నేరం" గా అభివర్ణించింది ఉక్రెయిన్ లోని అమెరికా రాయబార కార్యాలయం. రష్యా అధీనంలో ఉన్న అత్యంత భారీ అణు విద్యుదుత్పత్తి కేంద్రమైన జపరోజియాను తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకున్నామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుధ్దాన్ని ఉధృతి చేసింది రష్యా. 500 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది రష్యా. రష్యా రోజుకు రెండు డజన్ల చొప్పున అన్ని రకాల క్షిపణులను ప్రయోగిస్తోందని అమెరికా పెంటగాన్ అధికారి వెల్లడించారు. రాజధాని "కీవ్" నగరంలో మరిన్ని వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)