50 విమానాల్లో 11వేల మంది భారతీయులు రాక !

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ గంగలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల్లో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో తీసుకొస్తోంది. ఇప్పటివరకూ 50 విమానాల్లో ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల నుంచి భారత్‌కు 11 వేల మంది భారతీయులు చేరుకున్నారు. శనివారం  కూడా ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి భారత్‌కు మరో 15 విమానాలు చేరుకోనున్నాయి. ఇందులో 11 పౌర విమానాలు ఉండగా నాలుగు వాయుసేన విమానాలు ఉన్నాయి. మొత్తంగా ఉక్రెయిన్‌ నుంచి 2,200 మంది భారతీయులు విమానాల్లో స్వదేశానికి చేరుకోనున్నారు. ఖర్కివ్, సుమీలో సుమారు వెయ్యి మంది భారతీయులు చిక్కుకున్నారు వారిని సేఫ్‌గా భారత్ కు తరలించేందుకు కేంద్రం అన్ని ఏర్పాటు చేస్తోంది. ఈశాన్య ఉక్రెయిన్‌లో సుమీ నగరం చాలా చిన్నది తూర్పున రష్యా సరిహద్దుల్లో సమీపంలో ఈ సుమీ నగరం ఉంది. దీనికి 50 కిలోమీటర్ల దూరంలోనే రష్యా సరిహద్దు ఉంది. సుమీ నగరానికి పశ్చిమాన 1200 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో పోలండ్, హంగరీ, రొమానియా సరిహద్దులు ఉన్నాయి. సుమీ, ఖార్కీవ్ నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వీలైనంత తొందరగా రష్యాకు చేరవేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)