దేశంలో 5,921 కరోనా కొత్త కేసులు!

Telugu Lo Computer
0


గత కొద్దిరోజులుగా భారీగా కేసులు తగ్గిపోతుండడంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. ఐదు నుంచి ఆరు వేల లోపున కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 5 వేల 921 కేసులు నమోదు కాగా, ఈ వైరస్ బారిన పడి 289 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 63 వేల 878 యాక్టివ్ కేసులున్నాయని, ఒక్కరోజులో 11 వేల 651 మంది ఆరోగ్యవంతులయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 4,23,78,721 మంది కోలుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,14,878 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు… కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. 414 రోజులుగా 178.55 కోట్ల మందికి కరోనా టీకాలను పంపిణీ చేశారు. 24 గంటల్లో 24,62,562 మందికి టీకాలు ఇచ్చారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 178,55,66,940 డోసుల టీకాలను అందచేశారు. కరోనా వ్యాక్సినేషన్ తో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. 77.19 పరీక్షలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో 9,40,905 టెస్టులు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 77,19,14,261 మందికి టెస్టులు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 3309 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశ వ్యాప్తంగా 1426 ప్రభుత్వ లాబ్స్, 1883 ప్రైవేట్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)