కొన్ని గింజలు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


గుమ్మడికాయ గింజలు చాలా మంది పారవేస్తారు. కానీ ఈ విత్తనాలలో చాలా పోషకాలు ఉంటాయి. కొవ్వు, విటమిన్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. గుమ్మడికాయ గింజలను పచ్చిగా తినవచ్చు కానీ కాల్చిన గింజలు మరింత రుచికరంగా ఉంటాయి. అంతే కాకుండా బొప్పాయి గింజలలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. కొన్ని వ్యాధులకి చికిత్స చేయడంలో ఉపయోగిస్తారు. ఇవి ఒత్తిడిని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. బొప్పాయి గింజల్లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. మీరు బొప్పాయి గింజలను పచ్చిగా తినవచ్చు. కానీ వాటిని తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఘాటైన వాసన కలిగి ఉంటాయి. చింతపండు గింజలు కూడా ఆరోగ్యానికి మంచిదని కొన్ని పరిశోధనలలో రుజువైంది. ఈ విత్తనాలు మీ గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా దంతాలకు కూడా మేలు చేస్తాయి. అంతే కాదు వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కొంత మంది పెద్దలు ఇప్పటికి వీటిని కాల్చుకొని తింటారు. ఇవి కీళ్ల నొప్పులని కూడా దూరం చేస్తాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)