మూడు త్రాచుపాములతో సయ్యాట!

Telugu Lo Computer
0


కర్ణాటకలోని మాజ్ సయ్యద్ అనే వ్యక్తి ఒకేసారి మూడు త్రాచు పాములతో చేసిన ఫీట్ విషాదంగా ముగిసింది. సిర్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి తీరును చాలా మంది నిపుణులు ప్రమాదకరమని హెచ్చరిస్తూనే ఉన్నా వినిపించుకోలేదు. త్రాచులు ఎదురుగా కూర్చొని వాటి తోకలు లాగుతూ చేతులతో వాటిని ఆడిస్తుండటంతో మూడింటిలో ఒకటి చాలా అగ్రెసివ్‌గా రియాక్ట్ అయింది. సయ్యద్ యూట్యూబ్ ఛానెల్ మొత్తం అలాంటి వీడియోలే ఉన్నాయి. మూడింటిలో పెద్దదైన ఒక త్రాచు అమాంతం లేచి మోకాలిపై కాటేసింది. అప్పటికీ ఏ మాత్రం జంకకుండా దాని తోకను పట్టుకుని విడిపించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. చివరికి దీనిపై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుసాంత నందా విమర్శిస్తూ… పోస్టు చేశారు. ‘త్రాచు పాములను హ్యాండిల్ చేయడంలో ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు. ఆ పాముల కదలికను బట్టి చూస్తేనే ప్రమాదం పొంచి ఉందని భయం వేస్తుంది. కొన్ని సార్లు వాటి ప్రతిస్పందన ప్రాణాంతకం కావొచ్చు’ అని రాశారు. ఈ వీడియోను పోస్టు చేసిన ప్రియాంక కదాం అనే నెటిజన్.. సయ్యద్ తర్వాత హాస్పిటల్ పాలైనట్లు తెలిపారు. సయ్యద్ కు ఇది కొత్తేమీ కాదని, ఇప్పటి వరకూ పాము కాట్లకు 46సార్లు యాంటీ వీనం టీకా తీసుకున్నాడంటూ పోస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)