గుజరాత్ పాఠశాలల్లో పాఠ్యాంశంగా భగవద్గీత !

Telugu Lo Computer
0


గుజరాత్ పాఠశాలల్లో ఇక నుంచి భగవద్గీత ఓ సబ్జెక్ట్‌గా ఉండబోతోంది. 6 నుంచి 12 తరగతి పాఠ్యాంశాలలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేరుస్తున్నట్లు ముఖ్యమంత్రి  భూపేంద్ర పటేల్  తెలిపారు. దీనిపై గుజరాత్ విద్యాశాఖ 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రకటించిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. విద్యార్థుల్లో మానవతా విలువలను పెంచేందుకు, వారిని సన్మార్గంలో నడిపించేందుకు భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అదే విధంగా మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు భావి తరాలకు తెలుస్తాయని అన్నారు. గుజరాత్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాన్ని చాలా మంది ఆహ్వానిస్తున్నారు. భగవద్గీత ఆధారంగా శ్లోకం, వక్తృత్వం, నాట్యం, క్విజ్‌లాంటి సృజనాత్మక పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. మొత్తం 18 అధ్యాయాలున్న భగవద్గీతలో 700 శ్లోకాలు వున్నాయి. అయితే, పాఠ్యాంశాలలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో రామాయణం, మహా భారత్ ఇతి వృత్తాంతాలను చేర్చాయి. జాతీయ విద్యావిధానం, ఎన్ఈపీ 2020 ప్రకారం.. ఇంజనీరింగ్ సిలబస్ లలో కూడా వీటిని చేర్చారు. ప్రస్తుతం భగవద్గీత నిర్ణయంపై ప్రతి పక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)