ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత్ !

Telugu Lo Computer
0

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనూయి వేదికగా జరిగిన


మ్యాచ్ లో పాక్‌ ను   107 పరుగుల తేడాతో  ఓడించింది. భారత్ తొలుత నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన పాక్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. 43 ఓవర్లలో 137 పరులకు ఆలౌట్ అయ్యింది. పాక్ జట్టులో ఓపెనర్ సిద్రా అమీన్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లు గతి తప్పకుండా బౌలింగ్ చేయడంతో పాక్ బ్యాట్స్ మెన్స్ అష్టకష్టాలు పడ్డారు. పరుగుల కోసం శ్రమించాల్సి వచ్చింది. వత్తిడిలో ఉండడంతో త్వరత్వరగా అవుట్ అయిపోయారు. రాజేశ్వరీ ఏకంగా నాలుగు వికెట్లు తీశారు. ఝులన్ గో స్వామి, స్నేహ్ రాణా రెండేసి వికెట్లు తీశారు. చివరకు 43 ఓవర్లలో 137 పరుగులకే అలౌట్ అయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత మహిళల మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొక చేతులేత్తేశారు. పటపటా వికెట్లు పడుతుండడంతో క్రికెట్ క్రీడాభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఓపెనర్ స్మృతి మందాన హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. దీప్తి 40 పరుగులతో రాణించారు. చివరిలో ఏడో బ్యాట్స్ మెన్ గా దిగిన స్నేహ్ రాణా, పూజా వస్త్రాకర్ 67 బ్యాట్ ఝులిపించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. వీరిద్దరూ నాటౌట్ గా క్రీజులో నిలిచారు. మొత్తంగా మహిళల టీమ్ ఇండియా జట్టు ప్రపంచకప్ లో బోణీ కొట్టింది.

Post a Comment

0Comments

Post a Comment (0)