తెలంగాణ లో మద్యం రేట్ల తగ్గింపు ?

Telugu Lo Computer
0


గతంలో కొవిడ్ కారణంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం రేట్లను 20 శాతం వరకు పెంచింది ప్రభుత్వం. దాని కారణంగా మద్యంకు కాస్త డిమాండ్ కూడా తగ్గింది. దీంతో మద్యం సప్లై పెంచే దిశగా ఆబ్కారీ శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మద్యం రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. లిక్కర్ అమ్మకాలు పెంచడానికి ఒక్కో బాటిల్ పై 10 రూపాయలు తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల కాలంలో బీర్ల అమ్మకాలు తగ్గడంతో ఒక్కో బాటిల్ పై 10 రూపాయలు తగ్గించింది ప్రభుత్వం. లిక్కర్ బాటిల్ పై ధర మాత్రం తగ్గించలేదు. అందువలన బీర్లు మినహా ఇండియాలో తయారయ్యే మద్యంపై స్వల్పంగా ధరలు తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)