హైదరాబాద్ లో సిలిండర్ కు దండ వేసి ర్యాలీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 March 2022

హైదరాబాద్ లో సిలిండర్ కు దండ వేసి ర్యాలీ


పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ డివిజన్ ‎లో ఆందోళనకు దిగారు. గ్యాస్ సిలిండర్‌కు దండ వేసి ర్యాలీ నిర్వహించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత సి.డాక్టర్ రోహన్‌, జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాటూరి రమేష్‌తో పాటు జి.అశోక్ కుమార్, భవాని రమేష్. డాన్ రాజు, నాగార్జున, ఆంజనేయులు. పెండ్యాల విజయలక్ష్మి, వరలక్ష్మి, పార్వతి, కవిత, అంజమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి. డాక్టర్ రోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి మధ్య తరగతి కుటుంబాలపై భారం మోపిందని మండిపడ్డారు. అసలే కరోనా పరిస్థితులతో సతమతవుతున్న ప్రజలపై ధరల పెంపు దారుణమన్నారు. ధరల పెంపు విషయంలో కేంద్రప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని రోహన్ హెచ్చరించారు. పెరిగిన ధరలు తగ్గించేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.


No comments:

Post a Comment