ప్రతి నెలా ఎన్నికలుండాలి అప్పుడు పెట్రో ధరలు పెరగవ్‌!

Telugu Lo Computer
0


ఐదు రాష్ట్రాల ఎన్నికలున్నందునే ఇన్ని రోజులు పెంచకుండా, ఫలితాలు రావడంతో పెంచేశారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మండిపడ్డారు. ఇకపై ప్రతి నెలా ఎన్నికలుండాలని, దీంతో పెట్రో ధరల పెంపు ఉండదని ఎద్దేవా చేశారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్‌ ధర రూ.96.36కు చేరింది. నిన్న పెట్రోలు రూ.109.10, డీజిల్‌ రూ.95.50గా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పెట్రోల్‌ రూ.112.80, డీజిల్‌ రూ.98.10, విజయవాడలో పెట్రోల్‌ రూ.111.88, డీజిల్‌ రూ.97.90కి చేరాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)