మార్చి 31 నుంచి కోవిడ్ నిబంధనలు ఎత్తివేత ?

Telugu Lo Computer
0


దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మార్చి 31 నుంచి నిబంధనలను ఎత్తేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సూచించింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మాత్రం యథాతథంగా కొనసాగుతుందని హోంశాఖ స్పష్టం చేసింది. మార్చి 31 నుంచి ఇక కోవిడ్ నిబంధనలు అవసరం లేదని, వాటిని ఎత్తేయాలని సూచించింది. మరోవైపు చైనా, సౌత్ కొరియా, వియత్నాం, ఫ్రాన్స్ దేశాల్లో మళ్లీ కరోనా సబ్ వేరియంట్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. ఇలా విధించడం ద్వారా కరోనా కేసులను అదుపులోకి తీసుకురావొచ్చని కేంద్రం పేర్కొంది. ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ నిబంధనలను విధించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)