ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ముందంజ

Telugu Lo Computer
0


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ తేలనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేశారు. అందులోని ఈవీఎంలను పటిష్ట బందోబస్తు మధ్య కౌంటింగ్ హాల్స్‌కు తరలించి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టగా కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను చూస్తే ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్టుగానే ఎర్లీ ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తుండగా గోవాలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వార్ కనిపిస్తుంది. పంజాబ్ లో ఆప్ వైపు ట్రెండ్స్ కనిపిస్తుండగా యూపీలో వందకు పైగా స్థానాలలో బీజేపీ ముందంజలో దూసుకుపోతుంది. ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ కర్హాల్ లో ముందంజలో ఉండగా అమృతసర్ లో నవ్యజ్యోత్ సింగ్ సిద్దు ముందంజలో ఉన్నారు. గోరఖ్ పూర్ అర్బన్ లో యోగి ఆదిత్యనాధ్ లీడ్ లో కొనసాగుతుండగా పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా పంజాబ్ సీఎం అభ్యర్థి చన్నీ ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెనకంజలో ఉంటే పటియాలాలో అమరేందర్ సింగ్ ముందంజలో ఉన్నారు. అమేథిలో బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్, సాంక్వేలిన్ లో గోవా సీఎం అభ్యర్థి ప్రమోద్ సావంత్ ముందంజలో ఉన్నారు. జస్వంత్ నగర్ లో శివపాల్ యాదవ్, అధీక్యంలో ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)