సానుకూలంగా స్టాక్ మార్కెట్!

Telugu Lo Computer
0



ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ప్రారంభించిన రెండు గంటల్లోనే ఫలితాలపై స్పష్టత కనిపించడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్ పై కనిపించింది. గురువారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం 55809 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ గంట వ్యవధిలోనే 1270 పాయింట్లు లాభపడి 55932కి చేరుకుంది. 16,661 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 370 పాయింట్లు లాభపడి 16,725కు చేరుకుంది. ఇక బ్యాంకు నిఫ్టీ సైతం 1413 పాయింట్లు లాభపడి 35235వద్ద ట్రేడ్ అవుతుంది. రిలయన్స్, హిందూస్తాన్ యూనీలీవర్, హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ బ్యాంకుల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాస్త అటుఇటుగా ఉన్నా స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రాల్లో అధికార మార్పిడి దాదాపుగా లేకపోవడం.. ఒకే పార్టీకి ఓటర్లు మెజారిటీ కట్టబెట్టడంతో. అది స్టాక్ మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)