పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు 10 శాతం ప్లాట్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 March 2022

పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు 10 శాతం ప్లాట్లు


తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే అన్ని పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు 10 శాతం ప్లాట్లు రిజర్వు చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మహిళా పారిశ్రామిక పార్క్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ అభివృద్ధి చేసిన ఈపార్క్‌కు అవసరమైతే మరో 150 ఎకరాల భూమి కేటాయిస్తామన్నారు ప్రపంచ స్థాయి నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని ఫ్లో సభ్యులకు సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హబ్. వీ హబ్ సందర్శించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కేటీఆర్‌ సూచించారు. వీ హబ్ ఇప్పటికే 2 వేల 194 స్టార్టప్‌లను రూపకల్పన చేసిందని కేటీఆర్‌ తెలిపారు. ఇందు కోసం 66 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామన్నారు. స్టార్టప్ నిధులతో 2 వేల 800 మందికి ఉపాధి కల్పన సృష్టించామని అన్నారు. మహిళల కోసం కళ్యాణలక్ష్మి, షాది మూబారక్‌ లాంటి పథకాలను ప్రవేశపెట్టి.. వాటి కోసం తొమ్మిది వేల కోట్లను కేటాయించామన్నారు. షీ టీమ్స్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు కేటీఆర్. ఇప్పుడు ప్లాట్స్ రిజర్వ్ చేస్తున్నామని వివరించారు. తమది సంక్షేమ ప్రభుత్వం అని స్పష్టంచేశారు. ఐటీ వర్కింగ్ ఉమెన్స్‌కు మేలు చేయనుంది. ఇళ్ల కేటాయింపుతో లబ్ది చేకూరనుంది. అయితే విపక్షాలు మాత్రం ఎన్నికల స్టంట్ అంటున్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఈ డిసెంబర్‌లోనే అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ అనుకున్నారని ప్రచారం జరుగుతుంది. 

No comments:

Post a Comment