కేసీఆర్, హేమంత్ సొరేన్ భేటీ

Telugu Lo Computer
0


జార్ఖండ్‌ రాష్ట్ర రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలుత కేసీఆర్‌ మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఆశించిన ఫలాలు అందించేందుకు కొత్త మార్గంలో సాగాల్సిన అవసరం ఉందని, అయితే ఆ మార్గం ఏమిటి, ఎలా ఉండాలనే విషయాలు ఖరారు కాలేదని, త్వరలో స్పష్టత వస్తుందని కేసీఆర్ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదని, దీనిని సరిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ దిశగానే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సొరేన్ తొలిసారి ప్రత్యేక అతిథిగా హాజరై తెలంగాణ ప్రజలకు వెన్నంటి నిలిచారని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ప్రతిదశలో అండగా నిలిచిన శిబు సొరేన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నామని, తెలంగాణ అభివృద్ధి దిశలో సాగుతున్న తీరుపై శిబు సొరేన్‌ హర్షం వ్యక్తం చేశారని ఈ వార్తలో తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)