మదుపర్లకు మేలు చేసేలా మాత్రమే ఐపీఓ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 4 March 2022

మదుపర్లకు మేలు చేసేలా మాత్రమే ఐపీఓ


లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూ తేదీలపై కేంద్రం ఆచితూచి వ్యవహారిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసీ ఇష్యూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినా, అనుకోకుండా వచ్చిన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల వల్ల మార్కెట్లలో తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో పునరాలోచనలో పడింది. తాజాగా ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ తేదీలపై పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే స్పందించారు. మదుపర్ల అత్యుత్తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ విషయంలో మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎల్‌ఐపీ ఐపీఓ ప్రతిపాదన అనంతరం కోటి కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తెరచుకున్నాయంటే, ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతోందన్నారు. ఇపుడు మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 8 కోట్లకు పైగా చేరిందని తుహిన్‌కాంత పాండే చెప్పారు. ఎల్ఐసీ ఇష్యూ ద్వారా రూ.60,000 కోట్లు సమీకరించి, 2021-22 పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యమైన రూ.78,000 కోట్లను సాధించాలని కేంద్రం భావిస్తోంది. సంస్థకు, మదుపర్లకు మేలు చేసేలా మాత్రమే ఐపీఓ నిర్వహించాలన్నది తమ లక్ష్యంగా ఉన్నట్లు పాండే వివరించారు.


No comments:

Post a Comment