బంగాళాఖాతంలో అల్పపీడనం

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం వుందని భారత వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికలు చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహా సముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుందని, ఆపై మరో 24 గంటల్లో తమిళనాడు తీరానికి చేరువలోకి వస్తుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపుతుంది. అల్పపీడనం కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)