భీకర దాడుల మధ్య బంకర్‌లోనే వివాహం

Telugu Lo Computer
0


ఉక్రెయిన్ దేశంలోని ఒడెసా నగరంపై రష్యా సైనికులు రాకెట్లు, క్షిపణులు, బాంబులతో దాడులు చేస్తుండగా సైరన్లు మోగించడంతో బంకర్‌లో దాక్కున్న ఓ వధూవరులు సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. భీకర కాల్పులు జరుగుతున్న సమయంలో బంకర్‌లో అత్యంత భయాందోళనల మధ్య వధూవరుల వివాహం నిరాడంబరంగా జరిగింది. పెళ్లి సందర్భంగా వధువు పుష్పగుచ్ఛం చేత పట్టుకొని చిరునవ్వుతో కనిపించింది. మరో వైపు వరుడు పెళ్లి పత్రంపై సంతకం చేసి అనంతరం రొట్టెను వధువుతో కలిసి పంచుకున్నాడు. రష్యా సైనికులు దాడి అనంతరం ఉక్రెయిన్ దేశంలోని ఖేర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాంబుల దాడి, కాల్పుల మోత మధ్య బంకర్ లో పెళ్లాడిన నూతన జంటను సహచరులు అభినందించారు. రష్యా సైనిక దాడులతో రెండు వేల మందికి పైగా ఉక్రేనియన్ పౌరులు మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)