దేశంలో 6,561 కరోనా కొత్త కేసులు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలో ఉంది. దాంతో కరోనా కేసులు మరోసారి ఆరువేలకు దిగొచ్చాయి. బుధవారం 8 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 6,561 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కొత్త కేసులు మూడు నెలల కనిష్ఠానికి తగ్గిపోయాయి. పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు చేరింది. మరణాలు కూడా భారీగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 142 మరణాలు సంభవించగా.. ముందురోజు ఆ సంఖ్య 223గా ఉంది. ఇప్పటి వరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.14 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 14,947 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్నటి వరకూ రికవరీలు 4.23 కోట్లు దాటాయి. మొత్తం కేసుల్లో 98.62 శాతం మంది మహమ్మారిని జయించారు. మహమ్మారి వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు 77 వేలకు పడిపోయాయి. క్రియాశీల రేటు రెండు శాతం దిగువకు చేరి, 0.18 శాతంగా నమోదైంది. ఇక నిన్న 21.8 లక్షల మంది టీకా తీసుకోగా..ఇప్పటివరకూ 178 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)