వరుసగా రెండవ రోజూ కూడా పెంపు !

Telugu Lo Computer
0


నిన్న 80 పైసలు పైన పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కూడా దాదాపు అదే స్థాయిలో పెరిగాయి. తెలంగాణ హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర 91 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.99కు చేరింది. డీజిల్ కూడా అదే దారిలో వెళ్తోంది. డీజిల్ ధర లీటరుకు 87 పైసలు పైకి చేరింది. దీంతో దీని రేటు రూ. 96.35కు ఎగసింది. తెలంగాణ లోనే కాదు ఏపీ లోను ఇదే పరిస్థితి. ఏపీ గుంటూరు అమరావతిలో పెట్రోల్ రేటు లీటరుకు 87 పైసలు పెరిగింది. రూ. 112.08కు చేరింది. డీజిల్ రేటు కూడా 84 పైసలు పెరిగింది. దీంతో డీజిల్ ధర రూ. 98.1కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా పెరిగాయి. క్రూడ్ ధరలు మళ్లీ 115 డాలర్లకు పైన వుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.44 శాతం పెరిగింది. దీనితో ధర 116.13 డాలర్లకు చేరింది. ఇది ఇలా ఉండగా డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.61 శాతం పెరిగింది. దీంతో ఈ రేటు 109.92 డాలర్లకు ఎగసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)