ఇయు సభ్యత్వ దరఖాస్తుపై సంతకం చేసిన ఉక్రెయిన్‌

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌ సభ్యత్వం కోరుతూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్క్సీ దరఖాస్తుపై సంతకం చేశారు. జెలెన్క్సీతో పాటు ప్రధాని డెనిస్‌ ష్మిహాల్‌, ఉక్రెయిన్‌ ఏకసభ్య పార్లమెంట్‌ ఛైర్మన్‌ రుస్లాన్‌ స్టెఫాన్‌చుక్‌ సమక్షంలో ఈ దరఖాస్తు పై సంతకం చేశారు. దీనిపై రాష్ట్రపతి కూడా సంతకం చేశారు. ఈ ఫోటోలను జెలెన్స్కీ ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ..''ఇది ఉక్రెయిన్‌ ప్రజల హక్కు దీనికి మేము అర్హులం'' అనే ట్యాగ్‌ని కూడా జోడించారు. కాగా, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య బెలారస్‌లో సోమవారం జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో యుద్ధంలో దెబ్బతిన్న తమ దేశం కోసం వెంటనే ప్రత్యేక విధానంలో యూరోపియన్‌ యూనియన్‌ సభ్యత్వం పొందేందుకు అనుమతించమని జెలెన్స్కీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)