దళిత బంధు కార్యక్రమం కాదు - ఇదొక ఉద్యమం

Telugu Lo Computer
0


కెసిఆర్ ప్రారంభించిన దళిత బందు కేవలం కార్యక్రమం కాదు.. ఇదొక ఉద్యమమని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అని వెల్లడించారు. దళిత బంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా ఆ యూనిట్ ను గ్రౌండ్ చేసేలా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో లబ్ధిదారునికి మార్గనిర్దేశం చేస్తున్నారని స్పష్టం చేశారు. దళితులు కూలి పనులకు మాత్రమే పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్ర్యానికి ముందే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని నాడు అంబేద్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేశారన్నారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో 21% ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తూ జీవో 59 విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని… ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవు తున్నాయని చెప్పారు. 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టెల మీద దళితులు కూర్చున్నారని.. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్ & సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16% దళితులకు కేటాయిస్తున్నామన్నారు. వంద పడకల లోపు హాస్పిటల్ ను ఒక కేటగిరిగావంద పడకలకు పైగా ఉన్న హాస్పిటల్ ను మరో కేటగిరి గా విభజించాం… ఏయే ఆస్పత్రులను రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయించామని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)